లక్ష్మమ్మకు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష నివాళి

27-09-2026 | 06:51pm

కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి) : కాల్వ శ్రీరాంపూర్ మండలం(Kalva Srirampur Mandal) పెద్దంపేట్ గ్రామానికి చెందిన తాజా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి(Former ZPTC member Vangala Tirupati Reddy) అత్తమ్మ మంఢల లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి  చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పెద్దంపేట్‌లోని వారి నివాసానికి వెళ్లి లక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, లక్ష్మమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యంగా ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు