విద్యుత్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు

09-09-2026 | 11:16am

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిదిలోని  చాట్లపల్లి గ్రామంలో 33/11 కెవి  సబ్ స్టేషన్ ను బి ఆర్ ఎస్ నాయకులు(BRS leaders) మాజీ ఎంపిటిసి కావ్య దర్గయ్య, మాజీ కొండ పోచమ్మ చైర్మన్ జంబూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ముట్టడించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దిష్టి బొమ్మ దహనం చేసారు. అనంతరం రోడ్డు పై బైటయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోబాలకు గురిచేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు. ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా ఇబ్బంది పెడుతుంది అన్నారు. ఇప్పటికి అయినా రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు స్వామి,మాజీ సర్పంచ్ మల్లయ్య,భాస్కర్, రాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు