నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
08-09-2026 | 10:16am
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు(Black badges) ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ‘గౌరవ సభను కౌరవ సభ చేస్తారా.. సిగ్గు, సిగ్గు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.