కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట
తలమడుగు, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Anil Jadhav) ఆదేశాల మేరకు తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఆదివారం ధర్నా నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
రైతులకు సాగునీరు, ఎరువులు, రైతు భరోసా, రైతు బీమా విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.పేదలు, మహిళలు, యువత, ఉద్యోగులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు మరింత తీవ్రమయ్యాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.1000 రోజుల పాలన ప్రజలకు నిరాశ, ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం కల్పించలేదన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






