కాంగ్రెస్ హామీల అమలుకు బీఆర్ఎస్ వినతి
గుండాల, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ 2003 ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని మండల బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణీ కార్యక్రమంలో ఎంపీడీవో(MPDO) కు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం ఆ పార్టీ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ నాయకులు గడ్డం వీరన్నలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను వెంటనే అమలు చేయాలని, అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి నేటికీ 1000 రోజులైనా ఒక్క హామీని సైతం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి. రాము, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, జాడి ప్రభాకర్, లింగగూడెం ఉపసర్పంచ్ శోభన్ బాబు, ధనసరి భాస్కర్, గంగాధరి నాగన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు