బీఎస్‌ఎఫ్ జవాన్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

03-10-2026 | 08:32pm

మహబూబ్ నగర్ రూరల్: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దేశ రక్షణలో సేవలందిస్తున్న కోటకద్ర గ్రామానికి(Kotakadra Village) చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ శ్రీకాంత్‌(BSF Jawan Sreekanth)ను అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ సేవలను గ్రామస్థులు కొనియాడారు. గ్రామానికి చెందిన యువకుడు దేశ సేవలో భాగస్వామి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశ సేవలో కొనసాగుతున్న యువతకు శ్రీకాంత్ ఆదర్శంగా నిలుస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, యువత, గ్రామస్థులు పాల్గొని శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు