iPhone 18 Pro Sale: యాపిల్ స్టోర్ల ముందు జనసందోహం

18-09-2026 | 08:19am

న్యూఢిల్లీ: భారతదేశంలో ఐఫోన్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ స్టేటస్ సింబల్ గా మారింది. సెప్టెంబర్ 18న ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో(iPhone 18 Pro Sale) మ్యాక్స్ దేశవ్యాప్త అమ్మకాలు ప్రారంభం అయిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లోని(Select Citywalk Mall) ఆపిల్ స్టోర్, బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియా, ముంబైలోని ఆపిల్ స్టోర్ వెలుపల భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. ఆపిల్ స్టోర్(Apple Store) బయట ఆసక్తి గల వినియోగదారులు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నేరుగా కొనుగోలు చేయడానికి, వినియోగదారులు iPhone 18 Pro సిరీస్‌ను కొనుగోలు చేసేందుకు ఏదైనా అధికారిక Apple Store, Apple Authorized Reseller లేదా Croma, Vijay Sales వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ కేంద్రాలను సందర్శించవచ్చు.

ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధరలు 

ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక విక్రయాలు ప్రారంభం కావడంతో భారీగా జనం తరలివచ్చారు. iPhone 18 Pro 256GB వేరియంట్ ధర రూ. 1,64,900 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 512GB, 1TB,  2TB వెర్షన్ల ధరలు వరుసగా రూ. 1,89,900, రూ. 2,39,900, రూ. 3,14,900గా ఉన్నాయి. iPhone 18 Pro Max విషయానికొస్తే, 256GB మోడల్ ధర రూ. 1,79,900 నుండి మొదలవుతుంది, కాగా 512GB, 1TB, 2TB మోడళ్ల ధరలు వరుసగా రూ. 2,04,900, రూ. 2,54,900, రూ. 3,29,900గా నిర్ణయించబడ్డాయి.

ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఆఫర్లు


ప్రారంభ ఆఫర్లలో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్,  ఎస్‌బీఐ కార్డ్‌తో సహా అర్హత గల బ్యాంక్ కార్డులపై రూ. 7,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అర్హత గల కార్డ్ , రిటైలర్‌ను బట్టి, వినియోగదారులు ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు. 'ఆపిల్ ట్రేడ్-ఇన్' (Apple Trade In) ద్వారా లభించే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, పాత పరికరం మోడల్ , పరిస్థితిని బట్టి రూ. 81,500 వరకు విలువను అందించగలవు. కొత్త ఐఫోన్ మోడళ్లు ఆపిల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లు, అధీకృత రిటైలర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు