6 September, 2026 | 9:49 AM

కేపీహెచ్‌బీలో కారు బీభత్సం

06-09-2026 | 05:25am

కూకట్ పల్లి, సెప్టెంబర్ 5,(విజయక్రాంతి ):మద్యం మత్తులో కార్ రాష్ డ్రైవింగ్ చేసి భీబత్సం సృష్టించిన సంఘటన శుక్రవారం రాత్రి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (Kukatpally Housing Board Colony) 3 వ ఫేజ్ లో జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం కేపిహెచ్ బి కాలనీ 3వ ఫే జ్ కు చెందిన తరుణ్ తేజ్ తన స్నేహితుడు అఖిల్ తో కలిసి ఇంటికి సమీపంలో కార్ లో మద్యం సేవించారు. అనంతరం తరుణ్ కారు డ్రైవింగ్ చేస్తూ అఖిల్ తో కలిసి కాలనీ లోని పలు ప్రాంతాలలో తిరిగారు.

తరుణ్, అఖిల్ లు మద్యం మత్తులో కార్ ను రాష్ గా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న 8 మోటార్ సైకిల్ లను డీ కొట్టాడు. గమనించిన స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పో లీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని త రుణ్, అఖిల్ లను అదుపులోకి తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన్నట్లు తెలిపారు.

ఆ టెస్ట్ లో తరుణ్ కు 300పై చిలుకు పాయింట్స్, అఖిల్ కు 80కు పైన పాయిం ట్స్ వచ్చినట్లు పోలీస్ లు గుర్తించారు.దీంతో కార్‌ను స్వాధీనం చేసుకొని తరుణ్, అఖిల్ లపై డ్రంక్ అండ్ డ్రైవ్ ,రాష్ డ్రైవింగ్, కేసు లునమోదు చేసారూ. మితిమీరిన మద్యము తాగి డ్రైవింగ్ చేసిన తరుణ్ డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకొన్నారు. తరుణ్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణాశాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు