వ్యవసాయక్షేత్రంలో గంజాయి సాగు.. కేసు నమోదు
10-09-2026 | 08:36am
నేరడిగొండ,(విజయక్రాంతి): గంజాయి సాగు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ అన్నారు. నేరడిగొండ మండలంలోని(Neredigonda Mandal) బోరిగంలో గంజాయి సాగుచేస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక కొండప్రాంతంలోని వ్యవసాయక్షేత్రంలో ఎస్ఐ ఇమ్రాన్ సిబ్బందితో కలిసి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనికీల్లో బోరిగాంకు చెందిన కపిల్ పత్తిలో అంతర పంటగా గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. కపిల్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ద్విచక్రవహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీన పరుచుకున్న 125 గంజాయి మొక్కల విలువ రూ. 12.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.