5 September, 2026 | 5:24 PM

SIR గడువు పొడిగించండి.. ఈసీకి సుదర్శన్ రెడ్డి లేఖ

05-09-2026 | 03:21pm

హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐఆర్(Special Intensive Revision) గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission)కు సీఈవో సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు. ఎస్ఐఆర్ గడువు 3 వారాలు పొడిగించాలని సుదర్శన్ రెడ్డి లేఖలో(CEO Sudarshan Reddy) పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఓటర్ల వినతి మేరకు సీఈసీకి సీఈవో లేఖ పంపారు. ఈ నెల 16తో అభ్యంతరాలు, క్లెయిమ్ ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకు 47.79 లక్షల ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. 32.39 లక్షల మంది ఓటర్లు(Telangana voters) నోటీసులో ఇచ్చిన సమయానికి హాజరు కాలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,74,504 మంది హియరింగ్ పూర్తి అయినట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు