చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నర్ రమేష్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) జిల్లా అధ్యక్షులు రూప్నర్ రమేష్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma death anniversary) కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రూప్నర్ రమేష్ మాట్లాడుతూ... భూస్వామ్య, దొరల దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.