ఛలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల విడుదల
20-08-2026 | 05:30pm
బాన్సువాడ, ఆగస్టు 20: TSCPSEU ఆధ్వర్యంలో CPS రద్దు కోసం చేపట్టిన కార్యక్రమం 'ఛలో హైదరాబాద్' లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం TSCPSEU ఆధ్వర్యంలో కాంప్లెక్స్ సమావేశం విరామం సమయంలో ఆవిష్కరిచండం జరిగింది. ప్రతిఒక్క ఉపాధ్యాయుడు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రమణ, ఉపాధ్యాయులు నక్క ప్రవీణ్, ఆనంద్, సాయిరాం, మహేందర్, సంపత్, సంతోష్, ప్రసన్న లత, చైతన్య, రజిత, గంగామణి, శ్రీకాంత్ రెడ్డి, గీతాంజలి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.