చంటి దశదినకర్మకు హాజరైన డాక్టర్ మట్టా దయానంద్
27-09-2026 | 07:15pm
సత్తుపల్లి. సెప్టెంబర్ 27. (విజయ క్రాంతి) : సత్తుపల్లి మండలం(Sathupalli Mandal) రేజర్ల గ్రామానికి చెందిన కీ.శే. సాలి వెంకటేశ్వరరావు(Sali Venkateswara Rao) (చంటి) దశదినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Dr. Matta Dayanand Vijay Kumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, రేజర్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.