పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం:సర్పంచ్
మఠంపల్లి సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): మండలంలోని కాల్వపల్లి తండా(Kalvapalli Thanda) గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి: బాధితుడి కోసం నిమ్స్‌కు ఎమ్మెల్యే
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూక్యా విజయ భర్త రామల్ కి 40,000 రూపాయలు,భూక్యా సక్రు కి 60,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి అని తెలిపారు.అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం ప్రతి ఒక్కరూ ఈ పధకని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరీ కి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు జ్యోతి పిచ్చి రెడ్డి, వీరలక్ష్మి పాపాయ్య,ఎల్లారెడ్డి, ఉపసర్పంచ్ బాబా, వార్డు సభ్యులు రమేష్, సావిత్రి లచ్చిరాం,విజయ్ తదితరులు పాల్గొన్నారు.