ఆకట్టుకున్న మట్టి వినాయకులు
మద్దూర్,(విజయక్రాంతి): మద్దూర్ మండల పరిధిలోని రెనివట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో వినాయక చవితి పండుగ సందర్భంగా శుక్రవారం విద్యార్థులచే మట్టి వినాయకుల తయారీ పోటీలు(Clay Ganesha making competitions) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు అందమైన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ మాట్లాడుతూ.... ఎల్ నినో ప్రభావంతో దేశంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని కావున ప్రజలందరూ కృత్రిమ రంగులతో తయారు చేసిన గణపతి విగ్రహాలను కాకుండా మట్టితో తయారైన విగ్రహాలను పూజించాలని కోరారు,అలాగే డిజె ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి పోయింది అని దాని వల్ల ప్రజలకు అన్ని రకాలుగా నష్టం ఉందని కావున డిజె లు ఉపయోగించకుండా భజన,కోలాటాలతో నిమజ్జన ఊరేగింపు తీసుకొని పోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వీరయ్య,బాలరాజు,సాయి కుమార్,బ్రహ్మయ్య,భాను ప్రకాష్,రాజేష్,కృష్ణ లు తదితరులు పాల్గొన్నారు.