క్రీడలకు సీఎం రేవంత్ పెద్దపీట
బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో క్రీడలకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రో త్సహిస్తోందని బ్యాడ్మింటన్ అసోసియేషన్(Badminton Association) ఆఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా(Uppala Srinivas Gupta) అన్నారు. గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన యోనెక్స్ జీహెచ్ రైసోని మెమోరియల్ 5వ తెలంగాణ స్టేట్ మినీ బ్యాడ్మింటన్ ఛాం పియన్షిప్2026 ముగింపు కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై క్రీడాకారులను అభినందించారు.
తెలంగాణలోని వివి ధ ప్రాంతాల నుంచి సుమారు 280 మంది చిన్నారులు, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తిం చి మెరుగైన శిక్షణ, వసతులు, ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియే షన్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో బ్యాడ్మింటన్‌కు మరింత ప్రో త్సాహం లభిస్తోందన్నారు.
పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలని సూచించారు. ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సలహా దారుడు లక్ష్మణ్, సహాయ కార్యదర్శి మనో జ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోశాధికారి హర్ష వికాష్, కుమార్ నవీన్ గుప్త, నరేష్ గుప్త, కోశాధికారి సీతాళ్ పాల్గొన్నారు.






