ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

10-09-2026 | 06:00pm

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

మెట్ పల్లి,(విజాయక్రాంతి): మెట్‌పల్లి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను(construction work of government hospital building), అర్బన్ కాలనీ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(ollector B. Satyaprasad) గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించడంలో ఈ భవనాలు కీలకమని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన సామగ్రిని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో నరసింహ రావు,  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రి సూపరిండెంట్ , తహసీల్దార్ మక్తర్ పాషా, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు