సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయవద్దు
24-09-2026 | 08:13pm
జుక్కల్,(విజయ క్రాంతి): జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామం(Pedda Edgi village)లో జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్(cell phone tower) ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యక్తులు వచ్చి అక్కడ పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుతో పక్కనున్న ఇండ్లకు ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. దీంతో గురువారం జిపి సెక్రెటరీ రమేష్ కు, అదేవిధంగా ఎంపీడీవో శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. ఎవరు వద్దని చెప్పి సుమారు 20 మంది వరకు ఫిర్యాదులో సంతకాలు చేశారు. టవర్ ఏర్పాటు చేయకుండా చూడాలని వారు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రకాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.