తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ముగింపు
ముర్రుపాల ప్రాముఖ్యతపై అవగాహన
ఆరోగ్య లక్ష్మీ భోజనంపై దృష్టి
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల పరిధిలోని యజ్ఞనారాయణపురం, ముత్సవరం గ్రామపంచాయతీలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు కర్నాటి కోటేశ్వరి, కంచెపాగు సుజాత మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ముర్రుపాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో విలువైనవని, తల్లులు తప్పనిసరిగా పిల్లలకు అందించాలని సూచించారు.
అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆరోగ్య లక్ష్మీ భోజనాన్ని గర్భిణీలు,బాలింతలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, వైద్యులు సూచించిన టాబ్లెట్లు వినియోగించుకోవాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ సుజాత, ఏఎన్ఎం చిట్టెమ్మ, సెక్రటరీ శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్లు జ్యోతి,సులోచన, శైలజ, నిర్మల, కరుణకుమారి, ఆశా కార్యకర్తలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.






