6 September, 2026 | 1:00 AM

మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

06-09-2026 | 12:04am

* వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నేతల ఆగ్రహం 

* అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా 

* సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత 

అచ్చంపేట: అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ నేత శ్రీకాంత్ భీమా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అచ్చంపేట(Achampeta)లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRS Student Section) ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థి నేతలు(Student leaders) పట్టణంలోని ప్రధాన రహదారి వెంబడి ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాలో ప్లే కార్డులతో ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తూ నిరసన చేపట్టారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వెనతిరిపత్రాన్ని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా(Achampet Sub-Collector Saloni Chhabra) అందజేశారు. ఆయాచోట్ల నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలలోపు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ప్రజలకు న్యాయం చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు