హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నర్సాపూర్: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) విఫలమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshma Reddy) విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్‌లో విద్యార్థులు, యువతతో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి(Unemployment benefit) హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.






