అహింసా మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలి
కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి
బోథ్. అక్టోబర్ 2 (విజయ క్రాంతి) గాంధీజీ నడుచుకున్న అహింసా మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్(Congress party in-charge Ade Gajender) పిలుపునిచ్చారు. గాంధీ జయంతి ని పురస్కరించుకొని బోథ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరు గాంధేయ మార్గాన్ని అనుసరించి నట్లయితే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ ,ఉపసర్పంచ్ విజయ రెడ్డి , ఆత్మ బోత్ బ్లాక్ చైర్మన్ జి రాజు యాదవ్, సహకార సంఘం డైరెక్టర్ సట్ల ఉమేష్, గడ్డం సురేందర్, మహమ్మద్ రాజు రెడ్డి మండల అధికార ప్రతినిధి అచ్యుత్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ ,మెరుగు నరసింహ దాస్ షేక్ ,సాయన్న ,బుకరాములు ఎండి సద్దాం, సన్నీ రెడ్డి ,అమిరుద్దీన్ దొర శేఖర్ ,అభిరెడ్డి గుణవంతు, జగన్ తదితరులు పాల్గొన్నారు.