కాంగ్రెస్ 420 హామీలను నెరవేర్చాలి
08-09-2026 | 11:00pm
భూత్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్(Former Municipal Chairman Basvaraj Goud) ఆధ్వర్యంలో భూత్పూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ఇప్పుడు అవి నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు గద్దె దింపుతారు అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పాలన అన్నారు.