బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆగ్రహం

08-09-2026 | 12:00am

జడ్చర్ల: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను దళితుడనే కారణంతో బీఆర్ఎస్ నాయకులు అసభ్య పదజాలంతో అవమానించారని జడ్చర్ల కాంగ్రెస్ ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు ఎడ్ల చెన్నకేశవులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ కార్యక్రమానికి వస్తున్న సమయంలో సరైన విధివిధానాలు పాటించకపోవడంతో పోలీసులు అడ్డుకోగా, ఎమ్మెల్సీ మధు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. దళితుడు స్పీకర్ అయినందున ఓర్వలేకనే ఇలాంటి కుల వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎమ్మెల్సీ  మధు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు