ఇంటర్మీడియట్ లో ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్..!
కాగజ్నగర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామం(సిర్పూర్ టి)లో గల తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్(అప్ గ్రేడెడ్) జూనియర్ కళాశాల(Telangana Tribal Residential Junior College)లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరములో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి. రమ్యకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గిరిజన విద్యార్థినీలు మాత్రమే హాజరుకావాలని కోరారు. 10 వ తరగతి పాస్ మెమో, టి సి, కుల,ఆదాయ, ఆధార్ కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని తెలిపారు. ఎంపీసీలో 8 సీట్లు, బైపీసీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు.