విద్యార్థుల్లో సృజన నింపాలి
- వారి వ్యసనాలు, మాదకద్రవ్యాలు,
- అధిక స్క్రీన్ సమయంపై అప్రమత్తంగా ఉండాలి
- వారి ఆసక్తిని ఆవిస్కరణల వైపు మళ్లించాలి
- చదువుతోపాటు క్రీడలు కూడా కీలకమే..
- పిల్లల దైనందిన జీవితాలపై కూడా శ్రద్ధ వహించాలి
- విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయవద్దు
- ప్రతి చిన్నారిలో టాలెంట్‌ను గ్రహించి ప్రోత్సహించాలి
- బాల్యాన్ని పరిరక్షించాలి.. పిల్లల్లో సహజ ఉత్సుకతను పెంపొందించాలి
- ఉపాధ్యాయులను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విద్యార్థుల(Students)లో మాదకద్రవ్యాల వ్యసనం(drug addiction) పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రీడలు(sports), శారీరక ఆటలు(Physical game), సృజనాత్మక కార్యకలాపాల(creative activities) ద్వారా పిల్లలు అధిక స్క్రీన్ సమయాన్ని ఎదుర్కోవడంలో సహాయపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఉపాధ్యాయులను(teachers) కోరారు. వీరిని సృజనాత్మక ఆవిస్కరణల వైపు మళ్లించాలన్నారు. చదువు(Education)తోపాటు క్రీడలు కూడా చాలా కీలకమని, కేవలం చదువపైనే కాకుండా పిల్లల దైనందిన జీవితాలపై కూడా టీచర్లు(teachers) శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యార్థులను తరగతి గదికే(Classroom) పరిమితం చేయవద్దని, అప్పుడప్పుడూ బయటికి తీసుకెళ్లాలని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజు, శుక్రవారం జాతీయ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను శనివారం విడుదల చేశారు. బాల్యాన్ని పరిరక్షించాలని, పిల్లలలోని సహజ ఉత్సుకతను పెంపొందించాలని మోదీ ఉపాధ్యాయులను ప్రధా ని కోరారు.
తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతులను పంచుకోవాలని అన్నా రు. పిల్లల విద్యా పనితీరుకు ఉపాధ్యాయులు అతీతంగా చూడాలని, వారి ప్రవర్తన, దైనందిన జీవితాలపై శ్రద్ధ వహించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నందున, పిల్లల జీవితాలలో ఉపాధ్యాయులు పోషించాల్సిన పాత్ర మరింత ముఖ్య మని అన్నారు.
మాదకద్రవ్యాల గురించి మోదీ మాట్లాడుతూ.. కొన్ని పెద్ద నగరాలు, విశ్వవిద్యాల యాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియకపోవడం వల్ల ఈ సమస్య వల్ల ఎవరైనా ప్రభావితమవుతున్నారా? వ్యసనాలబారిన పడుతున్నారా? లేదా? అని గుర్తించడం కష్టమ ని తలెఇపారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో, ఉపాధ్యాయులు అవగాహన కల్పించడానికి చొరవ తీసుకోవాలి. అలాగే, ఏ విద్యార్థి ప్రవర్తనలోనైనా ఏమైనా మార్పు కనిపిస్తుందేమో నిశితంగా గమనించాలి’ అని చెప్పారు.
ఉపాధ్యాయులు కేవలం పుస్తకాలు, సిలబస్‌లకే పరిమితం కాకుం డా విద్యార్థుల జీవితాల్లోకి ప్రవేశించాలని ప్రధానమంత్రి కోరారు. ‘ఒక విద్యార్థి బాల్యం చనిపోవడానికి మీరు అనుమతించకూడదు. విద్యార్థుల జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు అందించగల అతిపెద్ద సహకారం ఇదే’నని స్పష్టం చేశారు.
విద్యార్థులను ఎక్కువసేపు స్క్రీన్ సమయానికి దూరంగా ఉంచి, బహిరంగ క్రీడా కార్యకలాపాల వైపు ఎలా ప్రోత్సహించవచ్చో కూడా మోదీ వివరించారు. పిల్లలకు ఒకే రకమైన ప్రాథమిక స్వభావం, జిజ్ఞాస ఉంటాయని, ఉపాధ్యాయులు ఈ జిజ్ఞాసను పెంపొందించి, సరైన మార్గంలో నడిపిస్తే, వారి అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందించగలరని తెలిపారు.
స్క్రీన్ టైమ్.. ఆందోళనకరం
విద్యార్థుల్లో స్క్రీన్ టైమ్ ఒక ప్రధాన ఆందోళనగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. తమ పిల్లలు స్క్రీన్లపై ఎంత సమయం గడుపుతున్నా రో, రాత్రిపూట కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారో లేదో అనే విషయాలపై తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆయన ఉపాధ్యాయు లను కోరారు.
క్రీడలు, శారీరక ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా స్క్రీన్ టైమ్‌ను సహజంగా తగ్గించవచ్చని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ, పిల్లలను తరగతి గది బయటకు తీసుకువెళ్లి, వారికి నిజ జీవిత నైపుణ్యాలు, పనిరూపాలతో అనుసంధానం చేయాల్సిన ప్రాముఖ్యతను మోదీ స్పష్టం చేశారు.
82 మందికి జాతీయ అవార్డులు
ఈ సంవత్సరం, మూడు శాఖల నుంచి 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు చెందిన 48 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు. అవార్డు గ్రహీతలు తమతమ బోధనా పద్ధతులను, అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు.
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన.. టీచర్‌కు ప్రసంశ
తన పరిసరాల్లోని మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం గురించి మాట్లాడిన ఒక ఉపాధ్యాయురాలిని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో తాను రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ‘రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఎక్కువ మంది మహిళలు ముందుకు వస్తున్నారు. దీనికోసం గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా నెలకొల్పుతున్నారు. ఈ విషయాలను మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను’ అని ఆయన తెలిపారు.






