3 రోజుల పాటు బ్యాంక్ లు బంద్
27-09-2026 | 09:54pm
* ఉద్యోగుల సమ్మెతో ఖాతాదారులకు తప్పని ఇబ్బందులు..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఐదు రోజుల పని దినాన్ని కల్పించాలని ప్రధాన డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు(Bank employees) సమ్మెబాట పట్టణం అన్నారు. దీంతో సోమవారం నుండి మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ పాటించనున్నాయి. మూడు రోజుల బ్యాంక్ సమ్మె కారణంగా వినియోగదారుల ఇబ్బందులను కొంత పరిష్కరించేలా సెలవు దినం అయిన ఆదివారం బ్యాంకులు పని చేశాయి. మూడు రోజులు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో పలువురు ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె కారణంగా ఖాతాదారుల డబ్బుల కోసం ఇబ్బందులు పడకుండ ఏటీఎం సెంటర్ లో ఇప్పటికే నగదును అందుబాటులో ఉంచారు.