వీర వనిత చాకలి ఐలమ్మ

10-09-2026 | 05:36pm

తాడ్వాయి,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో తనదంటూ ప్రత్యేక శైలితో పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నాయకులు కొనియాడారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో, కృష్ణాజివాడి గ్రామాలలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి(Death anniversary of Chakali Ailamma) సందర్భంగా నాయకులు ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ తిరుగులేని పోరాటం చేసిన గొప్ప నాయకురాలని తెలిపారు. ఆమె నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా మండలంలోని ఏండ్రి యాల్,బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి, ఎర్రపహాడ్, నందివాడ,చిట్యాల దేమి కలాన్ గ్రామాల్లో వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు