అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి
- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ
- కామారెడ్డి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన జిఎం
కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించ దానికి రైల్వే స్టేషన్ల(Railway stations) అభివృద్ధి పనులను అమృత్ భారత్ (Amrit Bharat)కింద చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అన్నారు. మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సాంకేతిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు.
రైళ్ల రాకపోకలను, మరింత సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు వసతులు ప్రయాణికులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. రైల్వే భద్రత, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, రైల్వే స్టేషన్ ల అభివృద్ధి చేయడం, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడం, వంటి సదుపాయాలను ప్రయాణికులకు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యత ఇస్తుంద న్నారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం కు స్థానిక అధికారు లు అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. అనంతరం అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించారు. భద్రత ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి పనులను సమన్వయం ముందుకు తీసుకెళ్లడం పై అధికారులతో చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించారు.
అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రత్యేక రైల్లో వచ్చిన జనరల్ మేనేజర్ కు 29వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అంజద్, స్థానికులు కలిసి వికాస్ నగర్ లో రోడ్ అండర్ బ్రిడ్జిని నిర్మించాలని వినతి పత్రంలో కోరారు.