5 September, 2026 | 2:13 AM

వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం వాయిదా

05-09-2026 | 12:05am

బోధన్,(విజయ క్రాంతి): వికలాంగుల హక్కుల పోరాట సమితి(Disabled Rights Fighting Committee) ఆధ్వర్యంలో ఖమ్మంలో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశాలను వాయిదా వేసినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Padma Shri Mandakrishna Madiga) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన సమావేశాలు కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 7వ తేదీకి మార్చినట్లు ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న ఖమ్మంలో జరిగే ఈ సమావేశానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని సుజాత సూర్యవంశీ కోరారు.

మరిన్ని వార్తలు