వార్డులో చెత్తబుట్టల పంపిణీ
01-10-2026 | 02:53pm
చేగుంట, సెప్టెంబర్ 30, విజయక్రాంతి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh's) ఆదేశాల మేరకు పట్టణం లో పరిసరాల పరిశుభ్రతను పెంపొందించేందుకు చేగుంట పట్టణ కేంద్రంలోని 14వ వార్డులో బుధవారం ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ చేపట్టారు. వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ ప్రతి ఇంటికీ వెళ్లి తడి, పొడి చెత్త కోసం రెండు వేర్వేరు బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ ట్రాక్టర్లకే ఇవ్వాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలని, రోగాలు ప్రబలకుండా ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.