నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 'చికెన్ అండ్ ఎగ్ స్టాల్స్' పంపిణీ
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరంలో చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో "చికెన్ అండ్ ఎగ్ స్టాల్స్"(Chicken and Egg Stalls) పంపిణీ కార్యక్రమం మున్సిపల్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Karimnagar Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు హాజరై 10 మంది లబ్ధిదారులకు ఈ ఆధునిక స్టాల్స్ ను పంపిణీ చేశారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ సంయుక్త సహకారంతో ఈ ఆకర్షణీయమైన "చికెన్ అండ్ ఎగ్ స్టాల్స్" లను రూపొందించారు.ఈ పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సువార్త కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, తాటి ప్రభావతి, రామన్, సౌగాని కొమురయ్య, భారీ జితేందర్, సరిల్ల ప్రసాద్, నలువాల రవీందర్, వరాల నర్సింగం, బుచ్చిరెడ్డి, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.