కల్లూరులో విస్తృతంగా భగవద్గీత ప్రతుల పంపిణీ

17-09-2026 | 09:17pm

కల్లూరు,(విజయ క్రాంతి): జై హనుమాన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి భగవద్గీత మహాయజ్ఞం’(Koti Bhagavad Gita Mahayagna)లో భాగంగా కల్లూరు పట్టణంలో భగవద్గీత(Bhagavad Gita) ప్రతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మోహన్‌ నాయక్‌(Municipal Chairman Mohan Nayak), వైస్‌ చైర్మన్‌ కోటేశ్వరి కృష్ణారెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆళ్లకుంట నరసింహారావు, కౌన్సిలర్ల సమక్షంలో మున్సిపల్‌ కార్యాలయంలో ప్రతులను అందజేశారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ లక్కినేని రఘుకు, బీజేపీ మండల అధ్యక్షుడు గుమ్మ రామకృష్ణ, పార్టీ నాయకుల సమక్షంలోనూ భగవద్గీత ప్రతులను బహూకరించారు.ఈ సందర్భంగా ట్రస్ట్‌ చైర్మన్‌ చెవుల నరేష్‌ మాట్లాడుతూ ప్రతి హిందువుకు భగవద్గీతను అందించడమే లక్ష్యమన్నారు.హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు, బీజేపీ ప్రతినిధులు పాల్గొని నరేష్‌ను శాలువాతో సత్కరించారు.

మరిన్ని వార్తలు