అన్న ప్రసాదం కార్యక్రమంలో ఆకు విస్తర్ల పంపిణీ

21-09-2026 | 02:53pm

మల్లాపూర్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు(Environmental protection) ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్లాపూర్ మండలం మొగిలిపేట 3వ వార్డు సభ్యుడు జంగ ప్రణయ్ పిలుపునిచ్చారు. మొగిలిపేట గ్రామంలో అఖిల్ యువసేన పాత బస్టాండ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులు, గ్రామస్తులకు ఆకు విస్తర్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జంగ ప్రణయ్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించే ఆకు విస్తర్లను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కారోబార్ గోల్కొండ పవన్, అఖిల్ యువసేన సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు