మహిళతో వీడియో కాల్.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

21-09-2026 | 12:31pm

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో(Telangana Police Department) మరో విషాదం చోటుచేసుకుంది. మూసారాంబాగ్ పరిధిలోని శాలివాహన నగర్‌లో సోమవారం 35 ఏళ్ల కానిస్టేబుల్ ఆత్మహత్య(Constable Ends Life) కలకలం రేపుతోంది. మరణించిన కానిస్టేబుల్ ను  అంబర్‌పేట్ ప్రధాన కార్యాలయంలో రైటర్ గా పనిచేస్తున్న ముథే చంద్రశేఖర్‌గా గుర్తించారు.అందిన సమాచారం ప్రకారం, చంద్రశేఖర్ ఒక మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు తెలిసింది.

అతని మాటలతో ఆందోళన చెందిన ఆ మహిళ వెంటనే చైతన్యపురి పోలీసులకు(Chaitanyapuri Police) సమాచారం అందించగా, వారు మలక్‌పేట పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital) తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. అసలు కానిస్టేబుల్ ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడు? వీడియో కాల్ మాట్లాడినా మహిళ ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు