ప్రజాసేవలో నేటి తరానికి స్ఫూర్తిదాయకం కొండా లక్ష్మణ్ బాపూజీ

21-09-2026 | 10:48am

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 

షాద్ నగర్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapalli Shankar) ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆయన త్యాగం, నిబద్ధత, ప్రజాసేవ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని ఎమ్మెల్యే(Shadnagar MLA) శంకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో  మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, షాద్ నగర్ తాలూకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, చెంది తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, ముబారక్, దర్శన్, కౌన్సిలర్లు బచ్చలి నరేష్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు