జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ నేతలు

21-09-2026 | 08:04am

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల భూముల ఆక్రమణలపై కాంగ్రెస్(Congress leaders) దండయాత్ర కొనసాగుతోంది. నేడు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంషాబాద్ లోని ఫాంహౌస్(Jagadish Reddy farmhouse)కు వెళ్లనున్నారు. ప్రజాభవన్ నుంచి ప్రజాప్రతినిధులు బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సర్కార్ స్థలాన్ని జగదీష్ రెడ్డి ఆక్రమించారని ఆరోపణలున్నాయి. ఫాంహౌస్ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనున్నారు. బీఆర్ఎస్(BRS Government) అధికారంలో ఉన్నప్పుడు భూములను దోచుకుందని ఆరోపిస్తూ, ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్, అజీజ్ నగర్ లో FTL లో కట్టిన ఫామ్ హౌస్ ను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పరిశీలించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు(BRS MLA Harish Rao) సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌ను సందర్శించి, దానిని ఎలా సంపాదించారో ఆరా తీశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు(Kalvakuntla Chandrashekar Rao), ఆయన కుమారుడు కె.టి. రామారావు కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు ఆరోపించబడుతున్న ఫామ్‌హౌస్‌లు, ఇతర ఆస్తులను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నిజాం కంటే కూడా కేసీఆర్ కుటుంబం గత పదేళ్లలో ఎక్కువ ఆస్తులను కూడబెట్టిందని కాంగ్రెస్ ఎంపీ చమల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

మరిన్ని వార్తలు