దాతల సహకారంతో విద్యార్థులకు చూచిరాత పుస్తకాల పంపిణీ
నేరేడుచర్ల,(విజయ క్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్ అధ్యక్షతన, క్లబ్ సీనియర్ సభ్యులు దాత లయన్ రావులపల్లి ప్రసాద్ ఆర్థిక సహాయం(Financial assistance)తో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేరేడుచర్ల విద్యార్థులకు చూచిరాత పుస్తకాల(notebooks) పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్ రావులపల్లి ప్రసాద్ మాట్లాడుతూ... విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థుల(students) విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలకు పెయింటింగ్ వేయించేందుకు రూ.50,000/- విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు,ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు అడ్వైజరీ కమిటీ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, చిలకరాజు శ్రీను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.