ఇబ్రహీంపూర్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
09-09-2026 | 07:07pm
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో(Ibrahimpur village) స్మార్ట్ రేషన్ కార్డులను(smart ration cards) లబ్దిదారులకు బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అశోక్ తో కలిసి రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే ఏ రాష్టంలో లేని మన రాష్టంలోనే నిరుపేదలందరికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంన్నారు. అలాగే పేదోడు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మొహీద్దీన్, జీపీఓ , గ్రామస్తులు, మహిళా సంఘం నాయకులు తదితరులుపాల్గొన్నారు.