పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

25-09-2026 | 02:57pm

కూసుమంచి, విజయ క్రాంతి: ఖమ్మం జిల్లాకు తలమానికమైన పాలేరు రిజర్వాయర్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్(District Collector Diwakar) శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో పాలేరు రిజర్వాయర్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, ఇరిగేషన్ ఎస్సీ మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిఈ రమేష్ రెడ్డి, కూసుమంచి తహసిల్దార్ డి సైదులు అధికారులు సిబ్బంది పరిశీలించారు.

పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం, పైనుంచి వచ్చే వరద ఉదృత్తి పరిస్థితి పై కలెక్టర్ కు వివరించారు. భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. దిగువున చెరువులను నింపాలని  ఆదేశించారు.

మరిన్ని వార్తలు