నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

10-09-2026 | 09:52pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గణేష్ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు.విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని సూచించారు. సిబ్బందికి రోల్ కాల్ ద్వారా తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, రూరల్ సీఐ తిరుపతయ్య, స్థానిక ఎస్సై శివకుమార్  తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు