వలస లంబాడీలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వవద్దు

21-09-2026 | 04:31pm

బోథ్,(విజయక్రాంతి): మహారాష్ట్ర నుండి వలస వచ్చిన లంబాడీలకు(Lambadas) ఏజెన్సీ, కుల దృవీకరణ పత్రాలు, ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఆదివాసి అనుబంధ సంస్థల వారు తాసిల్దార్ మల్లేష్ కు వినతి పత్రం పత్రం అందించారు. 1950 సంవత్సరానికి సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఏజెన్సీ దరఖాస్తులు ఇవ్వాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.

అక్రమంగా వచ్చిన వారికి కుల ధృవీకరణ ఏజెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంతో స్థానికంగా ఉన్న ఆదివాసులకు, అన్యాయం  జరుగుతుందన్నారు. అధికారులు పూర్తి విచారణ జరిపి సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు  జుగునక్ మారుతి, రాయి సిడం జాకేశ్, సార్ మేడి తోడసం లక్ష్మణ్ గౌరవ అధ్యక్షులు బండు పటేల్, సలహాదారు తుడసం గంగాధర్, రాందాస్ మాణిక్ రావు  మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు