గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

21-09-2026 | 05:40pm

* భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) సోమవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో ప్రతిష్ఠించిన గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.

ప్రతి గణేష్ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మండపాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు