టీ షాపును ప్రారంభించిన డాక్టర్ మట్టా దయానంద్
21-09-2026 | 03:11pm
సత్తుపల్లి. సెప్టెంబర్ 21. ( విజయ క్రాంతి): సత్తుపల్లి(Sathupalli) పట్టణంలోని మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ దునియా టీ షాపును రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, వార్డు కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.