2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

17-09-2026 | 08:55pm

దాదాపు రూ.5 లక్షల విలువ గల గంజాయి స్వాధీనం...

విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్న నార్నూర్ పోలీసులు..

నార్నూర్ సీఐ అంజమ్మ..

ఉట్నూర్,(విజయక్రాంతి): నార్నూర్ మండలం(Narnoor Mandal)లోని నడ్డంగూడ గ్రామ ప్రధాన రహదారి వద్ద గంజాయిని అక్రమంగా విక్రయించేందుకు  తీసుకెళ్తున్న  టకాట మోహన్ సింగ్ (60)  అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 2 కిలోల ఎండు గంజాయిని(Dried marijuana) స్వాధీనం చేసుకున్నట్లు నార్నూర్ సీఐ అంజమ్మ(Narnoor CI Anjamma) తెలిపారు. సెప్టెంబర్ 17న నార్నూర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఎస్. శ్రీ సాయి ఆధ్వర్యంలో పోలీసులు నడ్డంగూడ గ్రామ ప్రధాన రహదారి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో  అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పట్టుకుని తనిఖీ చేశారు.

నిందితుడిని టకాడ మోహన్ సింగ్ చోర్గావ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. అతని వద్ద ఉన్న లుంగీ మూటలో సుమారు 2 కిలోల ఎండు గంజాయి లభించగా, దాని విలువ సుమారు రూ.5 లక్షలుగా గుర్తించారు. గంజాయి సాగు చేసి కొంత వ్యక్తిగత వినియోగానికి, మిగిలినది విక్రయించేందుకు ఉంచుకున్నట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిపై NDPS చట్టం ప్రకారం నార్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అమ్మిన రవాణా చేసిన వ్యాపారం చేసిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 250 ఎకరాల కు ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా  ప్రజలకు గంజాయి పై సమాచారం అందించిన వారికి ఒక మొక్క కు సమాచారానికి 25 రూపాయలు చొప్పున, కిలో గంజాయి కి వెయ్యి రూపాయలు చొప్పున నజరానా ప్రకటించారు. ఆసక్తి కల యువతి యువకులు గంజాయి పై సమాచారం అందించి గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. 8712659973 నంబర్ కు వాట్స్అప్ మెసేజ్ రూపంలో సమాచారం అందించవచ్చు అని తెలిపారు. గంజాయి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎస్. శ్రీ సాయి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు