బ్యాంక్ అక్రమాల కేసులో 7 చోట్ల ఈడీ సోదాలు

18-09-2026 | 08:52am

రాంచీ: సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం నాడు జార్ఖండ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. జార్ఖండ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (Jharkhand State Co-op bank fraud case) సెరైకెలా శాఖలో వ్యాపారవేత్త సంజయ్ కుమార్ దాల్మియా, అప్పటి బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై పాల్పడినట్లు ఆరోపించబడుతున్న మోసంపై ఈ దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద జార్ఖండ్, ఒడిశాలోని 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు