విద్యుత్ షాక్ తో మహిళ మృతి
02-10-2026 | 05:38pm
కొడిమ్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి):జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన జనగాం రూప(33) శుక్రవారం కరెంటు షాక్ తగిలి క్రింద పడగా, గమనించిన స్థానికులు హాస్పిటల్ తరలించగా, అప్పటికే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.మృతురాలి భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళగా, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.