సాకేర గ్రామంలో ఉపాధి హామీ సమావేశం
09-09-2026 | 10:44pm
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలం(Sonala Mandal)లోని సాకేర గ్రామంలో బుధవారం ఉపాధి హామీ కార్యక్రమం(Employment Guarantee Program)లో భాగంగా చేపట్టనున్న పనుల పైన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) గ్రామస్తులతో సమావేశమై ముందు రోజుల్లో చేపట్టనున్న పనులపై చర్చించారు. అనంతరం ఆయన తమ పొలాలలో చేపట్టనున్న ఫామ్ ఫాంపండు పనులపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు