శభాష్.. పోలీస్

30-09-2026 | 11:16am

ఎర్రుపాలెం సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి): ఎర్రుపాలెం పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. డ్యూటీలో మానవత్వాన్ని చూపించి బాధ్యతగా చిన్నారి పాపను ప్రాణాపాయస్థితి నుండి కాపాడారు.ఎర్రుపాలెం పోలీసులపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.పోలీస్ స్టేషన్‎లో ఏఎస్ఐ(ASI) గా విధులు నిర్వహిస్తున్న,కొత్తపల్లి చంద్రశేఖర్  నాలుగు రోజుల క్రితం నైట్ పెట్రోలింగ్(Night patrolling) చేస్తుండగా మండలంలోని  మామునూరు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక పాప పాము కాటుకి గురవటముతో సమయానికి స్పందించిన ఏఎస్ఐ చంద్రశేఖర రావు,కానిస్టేబుళ్లు  ఉపేందర్,శేఖర్ సూరి,వారి బృందం కలిసి పోలీస్ వాహనంలో  హాస్పటల్ చేర్చడం వలన పాప ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి క్షేమంగా ఉంది.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రముఖ వైద్యులు కెవిఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోటా రాంబాబు ఏఎస్ఐను శాలువా కప్పి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్,నవ శకం ఫౌండర్ మేకల రమేష్,ఎంఎస్ఎఫ్ నాయకులు సగుర్తి శ్యామ్ సుందర్,గుండ్ల రత్నబాబు,చింతిరాల శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. 




మరిన్ని వార్తలు