కౌశిక్ రెడ్డి వ్యవహారం.. నేడు తేల్చనున్నఎథిక్స్ కమిటీ భేటీ

19-09-2026 | 10:49am

హైదరాబాద్,సెప్టెంబరు 19: (విజయ క్రాంతి): అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ(Ethics Committee) నేడు సమావేశం కానుంది. సభలో సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అనుచితంగా వ్యవహరించిన తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.

కమిటీకి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో.. ఈ వ్యవహారంపై సమగ్రంగా చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు నేడు మరోసారి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే సభ ఆమోదం పొందిన ఎథిక్స్ కమిటీ.. రాబోయే అసెంబ్లీ సమావేశాల వరకు కౌశిక్ రెడ్డిపై పూర్తి నివేదికను సభ ముందు ఉంచేందుకు స్పీకర్ అనుమతి తీసుకుంది. దీంతో నేటి సమావేశంలో కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు